నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామా నేపథ్యంలో ఈ నెల 22న శాసనసభలో బలం నిరూపించుకోవాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
పుదుచ్చేరిలో ఈనెల 22న బలపరీక్ష - పుదుచ్ఛేరిలో బలపరీక్షకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వానికి బలం నిరూపించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 22 సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణకు ఆదేశించారు.

పుదుచ్చేరి ప్రభుత్వానికి బలపరీక్ష
పుదుచ్చేరి శాసనసభలో మొత్తం 33 మంది సభ్యులు ఉండగా వివిధ రకాల కారణాలతో అయిదు ఖాళీలు ఉన్నాయి. మెజార్టీకి
15 మంది అవసరమవగా, నలుగురు శాసనసభ్యుల రాజీనామాతో కాంగ్రెస్-డీఎంకే కూటమి బలం 14కు పడిపోయింది. విపక్షాలకు కూడా 14 మంది సభ్యులు ఉన్నారు. పుదుచ్చేరి శాసనసభకు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగనుండగా.. అంతలోనే రాజకీయ సంక్షోభం తలెత్తింది.
ఇదీ చదవండి:పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు