అసెంబ్లీ ఎన్నికల వేళ పుదుచ్చేరి స్పీకర్ వీపీ శివకొలుందు తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకొలుందు తన రాజీనామా లేఖను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు సమర్పించారు. అనారోగ్యం కారణంగానే వైదొలుగుతున్నట్లు రాజీనామాలో పేర్కొన్నారు.
భాజపాలోకి కొలుందు సోదరుడు
నెలరోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివకొలుందు సోదరుడు వీపీ రామలింగం భాజపాలో చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు. దీంతో శివకొలుందు రాజీనామాకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫిబ్రవరి 21న తమ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన కాంగ్రెస్ మాజీ నేతలు కే లక్ష్మీనారాయణ్, కే వెంకటేషన్లు కూడా కమల తీర్థం పుచ్చుకున్నారు.
ఇదీ చూడండి:'వారసత్వ రాజకీయాల వల్లే కాంగ్రెస్ పతనం'