తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరి: బలపరీక్షలో ఓడిన సీఎం.. కూలిన ప్రభుత్వం

Puducherry assembly floor test today live updates
పుదుచ్చేరి అసెంబ్లీలో బలపరీక్షకు రంగం సిద్ధం

By

Published : Feb 22, 2021, 9:51 AM IST

Updated : Feb 22, 2021, 11:47 AM IST

11:44 February 22

ఓటింగ్​కు ముందే..

పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌-డీఎంకే కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవడంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి విఫలమయ్యారు. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం.. ఓటింగ్​కు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వాక్​ఔట్​ చేశారు. ఫలితంగా ఓటింగ్​కు ముందే ప్రభుత్వం కూలిపోయింది.

వరుస రాజీనామాలతో..

పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి ప్రభుత్వం.. విశ్వాస తీర్మానంలో గట్టక్కలేకపోయింది. వరసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వల్ల.. లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు.. ప్రత్యేకంగా సమావేశమైన సభలో ముఖ్యమంత్రి నారాయణస్వామి.. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఆయన.. భాజపా తీరుపై మండిపడ్డారు. డీఎంకే సహా.. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న ఆయన ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచామని చెప్పారు. 

పుదుచ్చేరిలో తాము రెండు భాషల విధానం అమలుచేయగా.. కేంద్రంలోని భాజపా సర్కార్ బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేంద్రం, ప్రతిపక్షాలతో కుమ్మక్కైన.. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌ కిరణ్ బేదీ.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని నారాయణస్వామి ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.

11:31 February 22

కూలిన ప్రభుత్వం...

పుదుచ్చేరిలో కాంగ్రెస్​ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం నారాయణస్వామి.. తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు.

11:13 February 22

'ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర'

  • తనకు మద్దతుగా ఓటేయాలని సభ్యులను కోరిన సీఎం నారాయణస్వామి
  • డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం: నారాయణస్వామి
  • అన్ని ఉపఎన్నికల్లో మా కూటమిని ఆదరించారు: నారాయణస్వామి
  • ప్రజలు మా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నట్లు స్పష్టమైంది: నారాయణస్వామి
  • ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రలు: నారాయణస్వామి
  • ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుని భాజపా కుట్రలు చేసింది: నారాయణస్వామి
  • మా ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండటం వల్లే ఐదేళ్లు కొనసాగాం: నారాయణస్వామి
  • పుదుచ్చేరికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వలేదు:

10:23 February 22

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ సర్కారు భవితవ్యాన్ని తేల్చే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. సభలో బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఆదేశాలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం.

కాగా, సభలో తనకు మద్దతు ఉందని సీఎం నారాయణసామి అసెంబ్లీలో పేర్కొన్నారు. తనకు మద్దతుగా ఓటేయాలని కోరారు.

పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రస్తుతం(ఖాళీలు మినహా) 26 సభ్యులు ఉన్నారు. మెజారిటీకి 14 మంది మద్దతు అవసరం. కాంగ్రెస్, డీఎంకేకు(ఓ స్వతంత్ర అభ్యర్థితో కలిపి) 12 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విపక్షాలకు 14 మంది సభ్యులు ఉన్నారు.

09:55 February 22

విశ్వాస పరీక్షకు ముందే...!

పుదుచ్చేరి శాసనసభలో..... విశ్వాస పరీక్ష ఓటింగ్‌కు వెళ్లకుండానే కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీనామా చేసే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే వి. రామచంద్రన్ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి...... తగిన సంఖ్యా బలం లేదన్న ఆయన తాను మాత్రం ప్రభుత్వానికే మద్దతిస్తానని స్పష్టంచేశారు.


ఇవాళ ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు.సీఎం ప్రసంగం కూడా చేస్తారు. ప్రసంగం ముగిసిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం ఆయన రాజీనామా చేస్తారు. ఓటింగ్‌కు వెళ్లకుండానే సీఎం రాజీనామా చేస్తారని నా అంచనా.

 ---వి.రామచంద్రన్, స్వతంత్ర ఎమ్మెల్యే, పుదుచ్చేరి

09:25 February 22

పుదుచ్చేరి అసెంబ్లీలో బలపరీక్ష.. కాంగ్రెస్​ గట్టెక్కేనా?

పుదుచ్చేరి అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కారు భవితవ్యం నేడు తేలనుంది. మెజారిటీని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఇచ్చిన ఆదేశాలతో నేడు ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

శాసనసభ సమావేశానికి హాజరయ్యేందుకు పుదుచ్చేరి సీఎం వీ నారాయణసామి అసెంబ్లీకి బయలుదేరారు.

పుదుచ్చేరి అసెంబ్లీలో 33 స్థానాలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్​ కూటమి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమికి 12(ఓ స్వతంత్ర అభ్యర్థితో) మంది సభ్యుల బలం ఉండగా.. విపక్షాలకు 14 మంది మద్దతు ఉంది.

జులైలో ఓ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. మొత్తంగా ఏడు ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం సభలో 26 మంది సభ్యులు ఉండగా మెజారిటీకి 14 మంది అవసరం.

Last Updated : Feb 22, 2021, 11:47 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details