కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా..
33 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 16 కాగా.. ఎన్డీఏకు 18 స్థానాలు, కాంగ్రెస్‌కు 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే వెల్లడించింది. ఇతరులకు ఒక్క స్థానం కూడా రాదని వెల్లడించింది.
రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్..
పుదుచ్చేరిలో భాజపా కూటమిదే అధికారమని రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది. ఎన్‌డీఏ 16 నుంచి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 11 నుంచి 13 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది.