తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇకపై ఆ సర్టిఫికెట్​ లేకపోతే నో పెట్రోల్​, డీజిల్​! - పొల్యూషన్​ సర్టిఫికెట్​

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ ఉన్న వాహనాలకు మాత్రమే పెట్రోల్​, డీజిల్​ పోసేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ఈ నెల 25 నుంచి 'నో పీయూసీ.. నో ఫ్యూయల్‌' అమల్లోకి రానుందని తెలిపారు.

puc-must-for-buying-fuel-in-delhi-from-oct-25
puc-must-for-buying-fuel-in-delhi-from-oct-25

By

Published : Oct 1, 2022, 6:08 PM IST

Updated : Oct 1, 2022, 6:13 PM IST

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్‌ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ ఉన్న వాహనాలకే ఇంధనం పోసేలా నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ఈ నిబంధన ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుందన్నారు. పర్యావరణ, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన అధికారులతో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

ఒకవేళ పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుండా పట్టుబడితే మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా విధించొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించొచ్చు. 'నో పీయూసీ.. నో ఫ్యూయల్‌'పై ఈ ఏడాది మార్చి 3న ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ఎక్కువ మంది దీన్ని అమలుకు మొగ్గు చూపడం వల్ల ఈ విధానం తీసుకొస్తున్నామని రాయ్‌ వెల్లడించారు.

2022 జులై నాటికి దిల్లీలో సుమారు 13 లక్షల ద్విచక్రవాహనాలు, 3లక్షల కార్లుసహా మొత్తం 17లక్షల వాహనాలు పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుండానే రాకపోకలు సాగిస్తున్నట్లు తేలటం వల్ల దిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

Last Updated : Oct 1, 2022, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details