Flag-lowering retreat ceremony: పంజాబ్ అట్టారీలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో నిత్యం నిర్వహించే ఫ్లాగ్-లోయరింగ్ రీట్రీట్ కార్యక్రమానికి సందర్శకుల ప్రవేశాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు సరిహద్ద భద్రతా దళం(బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
"దేశంలో కొవిడ్ పరిస్థితులతో పాటు అమృత్సర్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... పరిస్థితిని సమీక్షించి, అటారీ జాయింట్ చెక్‌పోస్టు వద్ద రిట్రీట్ కార్యక్రమానికి సందర్శకులను అనుమతించకూడదని బీఎస్ఎఫ్ నిర్ణయించింది. తక్షణమే దీన్ని అమలు చేయనున్నాం."
-బీఎస్ఎఫ్.