Pubg Boy Fake Bomb Call: కర్ణాటకలోని బెంగళూరులో పబ్జీకి బానిసైన ఓ బాలుడు చేసిన పని రైల్వే పోలీసులకు కాసేపు కలవరపెట్టంది. తన స్నేహితుడి ప్రయాణం వల్ల పబ్జీ ఆటకు అంతరాయం కలుగుతుందని ఆ బాలుడు.. కాచిగూడ రైలులో బాంబు ఉందని రైల్వే పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తీరా దర్యాప్తు చేపడితే అది ఫేక్ కాల్ అని తేలింది.
పబ్జీ దోస్త్ కోసం 'రైలులో బాంబ్'.. పోలీసులు హడల్ - bengaluru station news
Pubg Boy Fake Bomb Call: పబ్జీ ఆటకు స్నేహితుడి ప్రయాణం అడ్డువస్తుందని ఓ బాలుడు వింతగా ప్రవర్తించాడు. ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి స్నేహితుడు ప్రయాణించాల్సిన రైలులో బాంబు ఉందని చెప్పి మూడు గంటలు రైలు ఆపించాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఏం జరిగిందంటే?మార్చి 30న ఫోన్‌కాల్ చేసిన బాలుడి స్నేహితుడు యళహంక రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. ప్రయాణం మొదలయితే రైలులో సిగ్నల్ సమస్య వస్తుందని ఆ బాలుడు.. రైల్వే పోలీసులకు ఫోన్ చేసి ఆ ట్రైన్లో బాంబు ఉందని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలులో తనిఖీలు చేశారు. మూడు గంటల పాటు ప్రయాణికులను అనుమతించలేదు. ఆ తర్వాత కాల్ వచ్చిన నంబర్‌కు అధికారులు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇక అధికారులు దర్యాప్తు చేయగా.. బాలుడు యళహంక నివాసి అని, పబ్జీ ఆటకు బానిసయ్యాడని తెలిసింది. ఫోన్ చేసిన అతడు మైనర్ కావడం వల్ల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇదీ జరిగింది: నేరస్థుల గుండెల్లో బుల్డోజర్లు.. హత్య కేసులో ఎస్ఐ ఇల్లు కూల్చివేత