తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకోల వీరంగం.. కనిపించిన వారందరిపైన కాల్పులు.. ఒకరు మృతి - బెగుసరాయ్​ కాల్పులు

Psycho Killers Shot In Bihar : ఇద్దరు సైకో కిల్లర్లు తుపాకులతో వీరంగం సృష్టించారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డారు. అందులో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బిహార్​లోని బెగుసరాయ్​లో జరిగింది.

Psycho Killer Shot In Bihar
Psycho Killer Shot In Bihar

By

Published : Sep 13, 2022, 11:00 PM IST

Psycho Killers Shot In Bihar : బిహార్​ బెగుసరాయ్​లో ఇద్దరు సైకో కిల్లర్లు వీరంగం సృష్టించారు. తొమ్మిది మందిని తుపాకులతో కాల్చారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఎనిమిది మందిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నాలుగైదు ప్రాంతాలు తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఇంకా నిందితులని గుర్తించలేదని తెలిపారు. మృతుడిని చందన్​ కుమార్​ (30) గా గుర్తించారు.

"ఇద్దరు వ్యక్తులు మోటార్​ సైకిల్​పై తిరుగుతూ కనిపించిన వాళ్లపై కాల్పులకు దిగారు. వారిద్దరూ సైకో కిల్లర్లుగా అనిపిస్తున్నారు. అన్ని పోలీస్​ స్టేషన్ల పోలీసులను అలర్ట్​ చేశాం. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నాం" అని బెగుసారై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, ఇంకా కొందరిని మెరుగైన వైద్య సేవల కోసం పట్న తరలించామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details