దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారికోసం తమ అధీనంలో ఉన్న ఆసుపత్రులను లేదా ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్‌యూలు) కొవిడ్ చికిత్స కేంద్రాలుగా ఏర్పాటు చేసేలా చూడాలని సూచించింది. అనంతరం ఆయా ఆసుపత్రుల వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరుతూ లేఖ రాసింది.
కొవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చిన తర్వాత ఆక్సిజన్ సదుపాయం, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, అత్యవసర చికిత్స కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. గతేడాదిలానే ఈసారి కూడా కొవిడ్‌పై పోరాటంలో తమకు మద్దతు అందించాలని లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కోరారు.
డీఆర్డీఓ సారథ్యంలో..