ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లిమ్కా రికార్డులకెక్కిన బుల్లి చరఖా - Pryagraj man makes Gandhi Charkha

అంగవైకల్యం ఆయనకు అడ్డు రాలేదు. సాధించాలన్న తపన ఆయనను లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించేలా చేసింది. మూడు రోజుల్లో 2.5 సెంటిమీర్ల చరఖాను రూపొందించారు.

limca record for 2.5cm charka
2.5 సెంటీమీటర్ల బుల్లి చెరఖా
author img

By

Published : Jan 2, 2021, 10:55 PM IST

Updated : Jan 3, 2021, 6:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​కు చెందిన బిమల్​ కిశోర్​ అతిచిన్న చరఖా రూపొందించి లిమ్కా రికార్డుల్లో స్థానం సంపాదించారు. 35 ఏళ్ల కిశోర్​ మూడు రోజుల్లో 2.5 సెంటిమీటర్లు ఉండే చరఖాను రూపొందించారు. సాధించాలన్న ఆయన తపనకు అంగవైకల్యం అడ్డు రాలేదు.

2.5 సెంటీమీటర్ల బుల్లి చరఖా.. లిమ్కా రికార్డు

రికార్డు బద్దలు కొట్టాలని..

చరఖా వెనుక కథ గురించి ఈటీవీ భారత్ ఆరా తీసింది. మూడు సెంటీమీటర్లు ఉన్న చరఖాను ఎవరో తయారు చేసినట్లు తన స్నేహితుడు చెప్పారని.. ఆ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఈ బుల్లి చరఖాను చేశానన్నారు కిశోర్​. లిమ్కా రికార్డు సాధిస్తానని తాను ఊహించలేదన్నారు. వీటితో పాటు వరల్డ్ కప్, క్రికెట్ బ్యాట్, హాకీ స్టిక్​ ​ వంటి సూక్ష్మ ఆకృతులు కూడా రూపొందించారు.

ఇదీ చదవండి :రికార్డ్: కళ్లు మూసుకొని పియానో వాయించాడు

Last Updated : Jan 3, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details