వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనే వ్యాపారస్థులను, విక్రేతలను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికైత్. గత కొద్దిరోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు సంఘాల నేతలతో.. కేంద్రం చర్చలు జరుపుతుండగా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'మద్దతు ధర కంటే తక్కువకు కొంటే జైలుకు పంపాలి' - నరేశ్ టికైత్
పంటకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే విక్రేతలు, వ్యాపారుల్ని జైలుకు పంపిచాలని డిమాండ్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికైత్.
'మద్దతు ధర కంటే తక్కువకు కొంటే జైలుకు పంపాలి'
ఇందుకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఇలాంటి నిబంధన ఉండేలా చూడాలన్నారు. మద్దతు ధర అనేది రైతులు జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు నరేశ్.