తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Protests Against Chandrababu Arrest: ఆగని ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రగిలిన ఆగ్రహ జ్వాలలు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. అధినేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలుగుదేశం శ్రేణులు నేను సైతం బాబు కోసమంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుకుంటూ పలు చోట్ల.. దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఖాకీల ఆంక్షలను సైతం ఛేదిస్తూ.. చంద్రబాబు విడుదలయ్యే వరకు నిరసనలకు విరామం ఉండదంటున్నారు.

Protests Against Chandrababu Arrest
Protests Against Chandrababu Arrest

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 8:01 PM IST

Protests Against Chandrababu Arrest: నేను సైతం.. బాబు కోసమంటూ.. చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

Protests Against Chandrababu Arrest:చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాబు విడుదలవ్వాలంటూ పలు దేవాలయాల్లో పూజలు చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద నిర్వహించిన... రిలే నిరాహార దీక్షలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. చంద్రబాబుని అక్రమంగా (Fake Cases on Chandrababu) అరెస్టు చేసి.. రిమాండ్‌కి తరలించారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్క్రిప్ట్ ప్రకారమే తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాక్షసంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

దేశంలోని ప్రముఖలంతా చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) ఖండిస్తున్నారని తెలిపిన రామకృష్ణ.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలంతా కలిసి పోరాటం చేయాలన్నారు. అక్రమ కేసుల నుంచి బయటపడి.. ఎన్నికల్లో గెలిచి మళ్లీ చంద్రబాబు సీఎంగా రాష్ట్రాన్ని దేశంలో ముందువరసలో ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

TDP Protests Against Chandrababu Arrest : 'బాబుతో నేను'.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు తమ్ముళ్ల ఆందోళన

ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ కార్యాలయం వద్ద మహిళలు బాబుతో మేము సైతమంటూ (I Am with Babu Campaign).. పెద్దఎత్తున దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేము సైతం బాబుతో అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఓ మహిళ చంద్రబాబు జైల్లో పడుతున్న బాధను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో భావోద్యోగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుతూ ముస్లిం మహిళలు ఎండలోనే ప్రార్థనలు చేశారు. చంద్రబాబు బయటకు రావాలని కోరుకుంటూ కర్నూలులోని వినాయకుని ఆలయంలో శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి.. 101 టెంకాయలు కొట్టారు. నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో టీడీపీ శ్రేణుల చేపట్టిన దీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీక్షకు అనుమతి లేదంటూ.. పోలీసులు శిబిరంలో నుంచి శ్రేణులను బయటకు లాగారు. దీంతో శ్రేణులంతా.. రోడ్డుపైన భారీ ర్యాలీ నిర్వహించారు.

TDP Protests Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. 'బాబుతో నేను అంటూ' నిరసనలు

నెల్లూరులో ఏర్పాటు చేసిన దీక్షలో పాల్గొన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. నేను సైతం బాబు కోసమంటూ రక్తంతో సంతకం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద శ్రేణులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో శ్రేణులు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. తిరుపతి నగరపాలక కార్యాలయం ముందు చేపట్టిన దీక్షకు ఆటో డ్రైవర్లు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుకుంటూ.. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తెలుగుదేశం, మిత్రపక్షాల శ్రేణులు ఉద్యమించాయి. పార్వతీపురంలోని షిరిడీ సాయి మందిరంలో టీడీపీ కార్యకర్తలు పూజలు (Prayers for TDP Chief Chandrababu Naidu Bail) చేశారు. సాలూరులో టీడీపీ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను బయటకు లాగేందుకు యత్నించగా.. వారంతా కింద పడుకొని.. నిరసనను వ్యక్తం చేశారు. దీంతో... నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు.. పలుచోట్ల ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details