తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎక్స్​ప్రెస్​ వే దిగ్బంధంతో రైతుల నిరసన - రైతు పోరుబాట

కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా.. కుండ్లీ ఎక్స్​ప్రెస్ వేను దిగ్బంధించాయి రైతు సంఘాలు. దిల్లీలో కరోనా కేసులు విస్తృత స్థాయిలో పెరుగుతున్నప్పటికీ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశాయి. ఈ నెల 13, 14న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి.

Protesting farmers block KMP expressway in Haryana
రైతు ఉద్యమంలో 'కేఎంపీ ఎక్స్​ప్రెస్​ వే' దిగ్బంధం

By

Published : Apr 10, 2021, 11:48 AM IST

Updated : Apr 10, 2021, 12:49 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలకుపైగా దిల్లీ సరిహద్దులో ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు.. కుండ్లీ-మనేసర్-పల్వాల్​(కేఎంపీ)/వెస్టర్న్​ పెరిఫెరల్​ ఎక్స్​ప్రెస్​ వే, కుండ్లీ-గాజియాబాద్-పల్వాల్ హై వేలను దిగ్బంధించారు. సాగు చట్టాలు రద్దయ్యే వరకూ తమ పోరాటం ఆగదని మరోమారు తేల్చిచెప్పిన అన్నదాతలు.. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలను 24 గంటలపాటు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. అత్యవసర వాహనాలకు అనుమతినిస్తామని పేర్కొన్నారు.

ఎక్స్​ప్రెస్​ వే దిగ్బంధంతో రైతుల నిరసన
రహదారిపై బైఠాయించిన అన్నదాతలు
వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్న రైతులు

"కుండ్లీ-మనేసర్-పల్వాల్​ ఎక్స్​ప్రెస్​వే, కుండ్లీ-గాజియాబాద్-పల్వాల్ హై వేలను దిగ్బంధించాం. 24గంటలపాటు ఈ బంద్​ కొనసాగనుంది. ఈ సమయంలో కేఎంపీ ఎక్స్​ప్రెస్​వేపై ట్రాఫిక్​ సమస్యలు తలెత్తకుండా చూడాలని హరియాణా పోలీసులు కోరారు."

- హరీందర్​ సింగ్​ లఖోవాల్​, భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి

అయితే.. దిగ్బంధించిన ఎక్స్​ప్రెస్​ వేలలో.. శాంతిభద్రతలను కాపాడటం, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని అదనపు డెరెక్టర్​ జనరల్(శాంతి భద్రతల విభాగం) తెలిపారు. ట్రాఫిక్​ సమస్యలు తలెత్తకుండా ప్రజా రవాణాను సులభతరం చేసేందుకూ విస్తృత చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు.

హైవేపై నిరసన చేస్తున్న అన్నదాతలు
రైతన్నల నిరసన
రహదారిని దిగ్బంధించారిలా..
కేఎంపీ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

జలియన్​ వాలాబాగ్​ హింసాత్మక ఘటన జరిగిన ఏప్రిల్​ 13, అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్​ 14న.. దిల్లీ సరిహద్దుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:బంగాల్​లో ఎన్నికల వేళ బాంబుల కలకలం

Last Updated : Apr 10, 2021, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details