నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఈ దఫా స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివస్'గా జరుపుకోనున్నారు. ఆ రోజున దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు.
ఈ నెల 15న అన్నదాతల తిరంగా ర్యాలీలు - సంయుక్త కిసాన్ మోర్చా
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేయనున్నారు అన్నదాతలు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.
ర్యాలీ, రైతులు
సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సైకిళ్లు, బైకులు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై త్రివర్ణ పతాకాలను పట్టుకొని ఈ నెల 15న అన్నదాతల ర్యాలీలు నిర్వహిస్తారని అందులో పేర్కొంది.
ఇదీ చదవండి:'రైతులు చర్చలకు అందుకే రావట్లేదు'