తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నో స్కూలు- నో ఓటు​'.. పాఠశాలల మూసివేతపై ఆందోళనలు! - school reopen in punjab latest news

Protest For School Reopen: పాఠశాలలను రీఓపెన్​ చేయాలని పంజాబ్​ అంతట స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన బాట పట్టారు. స్కూళ్లను తెరవకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని తేల్చి చెబుతున్నారు.

Protest For School Reopen in punjab
విద్యార్థుల ఆందోళన

By

Published : Feb 5, 2022, 5:22 PM IST

Updated : Feb 5, 2022, 7:02 PM IST

పాఠశాలల మూసివేతపై ఆందోళనలు

Protest For School Reopen: పాఠశాలలను పునఃప్రారంభించాలని పంజాబ్​ అంతట స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలను తెరవకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని హెచ్చరించారు. స్కూళ్లను రీఓపెన్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఫ్లకార్డులు పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు.

పాఠశాలలను రీఓపెన్​ చేయాలని ఆందోళన

"గత ఏడాది తొమ్మిది నెలలు పాఠశాలలు మూసివేశారు. ఈ ఏడాది జనవరి 5 నుంచి అదే పరిస్థితి. విద్యార్థులు, టీచర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది."

-ఎం​ఏ షఫీ, ప్రైవేట్ స్కూల్​ ప్రిన్సిపల్

"మొబైల్ ఫోన్స్​లో ఆన్​లైన్​ క్లాసులతో మా పిల్లల కళ్లు పోతున్నాయి. చదువులపై సరైన ఏకాగ్రత పెట్టడంలేదు. రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీలు భారీగా జరుగుతున్నాయి. మరి.. పాఠశాలలు ఎందుకు మూసివేస్తున్నారు.."

-ఓ విద్యార్థి తండ్రి

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి 8వరకు పాఠశాలలు మూసివేయాలని పంజాబ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటినుంచే విద్యార్థులు ఆన్​లైన్​లో తరగతులకు హాజరవుతున్నారు.

స్కూళ్లను మూసివేస్తే ఓటు వేయమంటున్న తల్లిదండ్రులు

ఇదీ చదవండి:'ట్రాఫిక్ సమస్యే​ చాలా మంది విడాకులకు కారణం'

Last Updated : Feb 5, 2022, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details