తమిళనాడు రాజధాని చెన్నైలో మసాజ్ సెంటర్ల ముసుగులో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందిన పోలీసులు 151 మసాజ్, స్పా సెంటర్లపై రైడ్ చేశారు. ఈ వ్యభిచార దందాతో సంబంధమున్న పలువురిని అరెస్టు చేశారు.
చెన్నైలో మసాజ్ సెంటర్ల నిర్వహణకు చాలా మంది అధికారిక అనుమతులు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది అక్రమంగా ఈ కేంద్రాల్లో వ్యభిచారం నడిపిస్తున్నారు. ఆదివారం రాత్రి తియాగారాయ నగర్లో 20 , కిల్పాక్లోని 6 మసాజ్ సెంటరల్లో డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్ నేతృత్వంలో పోలీసులు రైడ్ చేశారు.