తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా, ఆర్ఎస్​ఎస్​కు మహిళలంటే గౌరవం లేదు' - ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

భాజపా, ఆర్​ఎస్ఎస్​లపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. ఉత్తర్​ప్రదేశ్​లో క్రైస్తవ సన్యాసినులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. కేవలం ఓట్ల కోసమే అమిత్ షా ఈ ఘటనను ఖండించారని విమర్శించారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. భాజపా, ఆర్​ఎస్​ఎస్​లకు మహిళల పట్ల గౌరవం లేదని దుయ్యబట్టారు.

Priyanka Gandhi Vadra, Priyanka
ప్రియాంకా గాంధీ, ప్రియాంక

By

Published : Mar 30, 2021, 6:41 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో నన్​లను కొందరు యువకులు వేధించిన ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. భాజపా, ఆర్ఎస్​ఎస్​లకు మహిళలంటే గౌరవం లేదని విమర్శించారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఈ ఘటనను ఖండించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మిర్శించారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లం జిల్లా కరునాగపల్లిలో ర్యాలీలో పాల్గొన్నారు ప్రియాంక. రైళ్లలో నన్​లపై వేధింపులకు పాల్పడి, ఐడెంటిటీ కార్డు చూపించాలని అడిగే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

"మీ మతమేంటని నన్​లను అడిగే హక్కు ఎవరిచ్చారు? మహిళలు రైళ్లలో వేధింపులు ఎదుర్కోకుండా ప్రయాణించే పరిస్థితి దేశంలో లేదా? మీ వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయాలపై కొంతమంది గూండాలకు సమాధానం చెప్పాలా? మహిళలకు రక్షణ కల్పిస్తామని భాజపా, ఆర్​ఎస్ఎస్ బూటకపు ప్రకటనలు చేస్తాయి. కానీ వాళ్లకు మహిళలంటే గౌరవమే లేదు. కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి ఎలా వెళ్లాలి అని వారు చెబుతారు. వాళ్ల మంత్రులు మహిళలు వేసుకునే జీన్స్ గురించి మాట్లాడుతారు. మహిళలు వేరే జిల్లాలకు ప్రయాణించే ముందు పోలీసుల వద్ద రిజిస్టర్​ చేసుకునేలా చట్టం తీసుకురావాలని మరో మంత్రి అంటారు. వాళ్లు అమ్మ, సోదరి, బేటీ అని పిలుస్తారు తప్ప మహిళగా గుర్తించి గౌరవం ఇవ్వరు. కానీ ఈ దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి, మహిళలే బలం.మనం అమ్మలం, భార్యలం, కూతుళ్లం, అక్కా చెల్లెళ్లం అయినందుకు గర్వ పడాలి. వీటన్నింటికంటే మనం మహిళలైనందుకు గర్వించాలి.

-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

కేంద్రంలో భాజపా సర్కార్​ను​ బలహీనమైనదిగా అభివర్ణించారు ప్రియాంక. వారు ఒక జోక్​ను కూడా సహించలేరని విమర్శించారు. ఎగతాళి చేయకముందే కమేడియన్​ను అరెస్టు చేస్తారని ఆరోపించారు. అసమ్మతి, వాదనలు, ఎదిరించి నిలబడటం వంటి వాటిని తట్టుకోలేరని చెప్పారు.

రోడ్ షో..

అంతకుముందు అలప్పుజలో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రియాంక. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె కేరళ చేరుకున్నారు.

ఇదీ చూడండి:'ఇది దేశ ప్రతిష్ఠను దిగజార్చే ఘటన'

ABOUT THE AUTHOR

...view details