Priyanka gandhi women power: ప్రత్యర్థి పార్టీలు మహిళలను విస్మరించాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం ఆరోపించారు. 'యవతిని.. పోరాడగలను' (లడ్కీ హూ, లడ్ సక్తీ హూ) అంటూ కాంగ్రెస్ పార్టీ నినాదమిచ్చాకే.. విపక్షాలన్నీ మహిళల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. పార్టీలోని మహిళా విభాగం ఏర్పాటు చేసిన 'మహిళా శక్తి సంవాద్' ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్నపాటి చొరవ ఇతర అన్ని పార్టీల కళ్లు తెరిపించిందన్నారు.
'ఎల్లుండి ప్రధాని ఇక్కడ బహిరంగ సభ పెడుతున్నారు. సభకు మహిళలను మాత్రమే ఆహ్వానించారు. ఆ ఘనత మనదే' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. 'లడ్కీ హూ, లడ్ సక్తీ హూ' అనేది మహిళా శక్తిని నొక్కిచెప్పడానికి ఇచ్చిన నినాదాలలో ఒకటి.
'టెలీ-ప్రాంప్టర్లో చూసి చదవడమే!'