'సైకిల్ గర్ల్' జ్యోతి కుమారితో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్లో మాట్లాడారు. జ్యోతి తండ్రి మృతి పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతేడాది లాక్డౌన్ వేళ తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్ గర్ల్'గా జ్యోతి కుమారి గుర్తింపు పొందింది. అయితే.. గుండెపోటు కారణంగా ఆమె తండ్రి ఇటీవల మృతి చెందాడు.
ప్రియాంక గాంధీతో ఫోన్లో మాట్లాడుతున్న జ్యోతి జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ప్రియాంక గాంధీని కలవాలనుకుంటున్నాన్న జ్యోతి వినతికి ఆమె సానుకూలంగా స్పందించారు.
ప్రియాంక తరఫున కాంగ్రెస్ నేత మష్కూర్ అహ్మద్ ఉస్మానీ.. జ్యోతి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రియాంక స్వయంగా రాసిన ఓ లేఖను అందజేశారు.
'సైకిల్ గర్ల్' జ్యోతి కుమారికి ప్రియాంక ఫోన్ గతేడాది తండ్రిని ఎక్కించుకొని సైకిల్ నడిపిన జ్యోతి పాత సైకిల్ కొని..
హరియాణా దర్భంగలోని సిర్హుల్లి గ్రామానికి చెందిన జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాసవాన్.. గుర్‌గ్రామ్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అతని మోకాలికి బలమైన గాయం అయింది. అదే సమయంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల గుర్‌గ్రామ్‌లో చిక్కుకున్నాడు. తండ్రితో సహా సొంత గ్రామానికి చేరుకోవాలని నిశ్చయించుకున్న జ్యోతి.. పాత సైకిల్ కొని దాంతో గ్రామానికి చేరుకుంది.
జ్యోతి సాహసానికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2021 ఆమెను వరించింది. వర్చువల్‌గా జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవంలో.. జ్యోతి ధైర్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. బిహార్ ప్రభుత్వం ఆమెను డ్రగ్ డీఆడిక్షన్ ప్రచార కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
ఇవీ చూడండి :