Priyanka Gandhi on UP Polls: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు మతపరమైన విభజనను కోరుకోవడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. అలాంటి విభజన.. భాజపా, ఎస్పీలకు మాత్రమే నప్పుతుందని చెప్పారు. మతపరమైన విభజన వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది భాజపాయే కావచ్చని ఆమె చెప్పారు. మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భాజపా ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నా, ఆ పార్టీకి పాలించడమే రాదని యూపీని చూస్తే తెలుస్తుందన్నారు. ముఖాముఖి ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
కులమతాలపై కాదు.. అభివృద్ధిపైనే ఎన్నికలు
"యూపీలో వేర్వేరు రాజకీయ పార్టీలు భిన్న అంశాలను లేవనెత్తుతున్నాయి. కులం, మతం ప్రాతిపదికన ప్రజల్ని విడదీసేవి వీటిలో కొన్ని ఉన్నాయి. ఈ పద్ధతిలోనే యూపీలో ఎన్నికల్లో పోరాడి గెలుస్తున్నారనేది వాస్తవం. ఈ పరిస్థితి మారాలని నేను గట్టిగా భావిస్తున్నా. అభివృద్ధి, ఉపాధి కల్పన, ఆరోగ్య సేవలు, విద్య లాంటి అంశాలపై ఎన్నికల్లో పోరాడాలి. చర్చలన్నీ వాటిచుట్టూ సాగాలి. వ్యతిరేక ప్రచారం జోలికి పోకుండా పురోగమన, సానుకూల అంశాలే కేంద్రంగా యూపీలో కాంగ్రెస్ పనిచేస్తోంది.
బలాన్ని గుర్తెరిగితే రాజకీయాలను మార్చగలరు
జనాభాలో 50% మంది మహిళలే ఉన్నా రాజకీయ యవనికపై వారికి ఇప్పటివరకు తగిన ప్రాతినిథ్యం లేదు. తమ బలాన్ని గుర్తెరిగి, రాజకీయ/ ఎన్నికల శక్తిగా వారంతా మారితే దేశ రాజకీయాలనే వారు మార్చగలరు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి మేం టికెట్ ఇచ్చాం. రాజకీయ బలం ఉన్న ఎమ్మెల్యే చేతిలో ఆ కుటుంబం నాశనమైంది. అదే అధికారాన్ని ఉపయోగించుకుని, కొత్త జీవితాన్ని ఏర్పరచుకుని, ఇతరులకు సాయపడే అవకాశాన్ని ఆ కుటుంబానికి ఇవ్వడమే మా ఉద్దేశం.
ఆదిత్యనాథ్ విషయం బహిరంగ రహస్యమే