ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ (UP Congress news) ప్రతిజ్ఞ యాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi news latest) ప్రారంభించారు. బారాబంకి జిల్లా నుంచి యాత్రను (Congress Pratigya yatra) జెండా ఊపి ప్రారంభించిన ప్రియాంక.. రైతులకు పలు హామీలు ప్రకటించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే అన్నదాతల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. వరి, గోధుమలకు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రియాంక (Priyanka Gandhi news latest) తెలిపారు. కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు ప్రియాంక. వారం రోజుల్లో దాన్ని విడుదల చేస్తామన్నారు. బాలికలకు ఉచిత ఇ-స్కూటీ, మొబైల్ ఫోన్లు ఇస్తామని ప్రియాంక పునరుద్ఘాటించారు.
మహిళా రైతులతో ముచ్చట్లు