తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ వరాలు.. వారికి స్మార్ట్​ఫోన్​లు, ఈ-స్కూటీలు! - ఉత్తర్​ప్రదేశ్ కాంగ్రెస్

ఉత్తర్​ప్రదేశ్​లో అధికారంలోకి వస్తే ఇంటర్ పాసైన బాలికలకు స్మార్ట్​ఫోన్లు (Smartphones for students) అందిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi twitter) ప్రకటించారు. డిగ్రీ చదివిన యువతులకు విద్యుత్ స్కూటీలు ఇస్తామని తెలిపారు.

priyanka gandhi
కాంగ్రెస్ వరాలు.. విద్యార్థినులకు స్మార్ట్​ఫోన్​లు, ఈ-స్కూటీలు!

By

Published : Oct 21, 2021, 1:48 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముమ్మర (UP assembly election 2022) ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. పోటీ చేసే స్థానాల్లో ఇప్పటికే 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్ చేసిన కాంగ్రెస్​.. తాజాగా బాలికలకు వరాలు ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పన్నెండో తరగతి పాసైన బాలికలకు స్మార్ట్​ఫోన్లు (Smartphones for students), డిగ్రీ చదివిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi news latest) తెలిపారు.

ప్రియాంక ట్వీట్

"నిన్న కొందరు బాలికలను కలిశాను. చదువుకోవడానికి స్మార్ట్​ఫోన్లు కావాలని వారు అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ చదివిన వారికి ఎలక్ట్రిక్ స్కూటీలు, ఇంటర్ పాసైన బాలికలకు స్మార్ట్​ఫోన్లు అందిస్తాం. మేనిఫెస్టో కమిటీ ఆమోదంతో కాంగ్రెస్ యూపీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది."

-ప్రియాంకా గాంధీ ట్వీట్ (Priyanka Gandhi twitter)

ఈ మేరకు కొందరు విద్యార్థినులతో ఓ వార్తా ఛానెల్ రిపోర్టర్ మాట్లాడుతున్న వీడియోను ట్వీట్​కు జత చేశారు ప్రియాంక. పర్యటనలో భాగంగా ప్రియాంకతో వీరంతా సెల్ఫీ దిగారు. ఈ సమయంలోనే తమకు ఫోన్లు లేవని ప్రియాంకతో చెప్పారు. స్మార్ట్​ఫోన్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని ప్రియాంక తమకు హామీ ఇచ్చారని విద్యార్థులు వెల్లడించారు.

మహిళల సాధికారత కోసం వారికి పెద్ద ఎత్తున సీట్లు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ మంగళవారం ప్రకటించింది. పోటీ చేసే సీట్లలో 40 శాతం మహిళలకే కేటాయిస్తామని తెలిపింది. దీని వెనుక రాజకీయ ఉద్దేశం, ఇతర అజెండాలు ఏమీ లేవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:ఆ ఎన్నికల్లో 40% టికెట్లు మహిళలకే: ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details