మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi News)మండిపడ్డారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు ఎలాంటి భద్రత లేదని.. కానీ బిలియనీర్ స్నేహితులకు మాత్రం పాలకులు భద్రత కల్పిస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాంగ్రెస్ (CONGRESS NEWS) ఆధ్వర్యంలో 'రైతులకు న్యాయం' పేరిట ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ఈ దేశం కొంత మందిది మాత్రమే కాదని, మీ అందరిదని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఈ దేశం ప్రధాని, ఆయన మంత్రులది మాత్రమే కాదు. ఈ దేశం మీది. అప్రమత్తంగా లేకపోతే మీ దేశంతోపాటు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు' అని పేర్కొన్నారు.
లఖింపుర్ ఖేరీలోని రైతుల మృతిపై స్పందించని ప్రధాని మోదీ సహా ఇతర నేతలపై ప్రియాంక మండిపడ్డారు. లఖ్‌నవూలో పర్యటించవచ్చు కానీ లఖింపుర్ ఖేరీలో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించలేరా? అంటూ ఈనెల 5న లఖ్‌నవూను సందర్శించిన మోదీని ఉద్దేశించి మాట్లాడారు. రైతుల హత్యలో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి, హోం మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కావాల్సింది డబ్బు కాదని, వారికి న్యాయం కావాలని కోరారు.
లఖింపుర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించాలని ప్రియాంకా గాంధీ గతంలోనూ డిమాండ్ చేశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నేడు లఖ్‌నవూ చేరుకోనున్న నేపథ్యంలో ప్రియాంక ఓ వీడియో విడుదల చేశారు. నిరసన ప్రదర్శనలో ఉన్న రైతులపై వాహనాలు దూసుకెళ్తున్న వీడియో చూపుతూ.. సంబంధిత మంత్రిని ఇంకా ఎందుకు తొలగించలేదో ప్రధాని దేశవాసులకు సమాధానం చెప్పాలన్నారు. నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదో కూడా తెలపాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో బంద్‌కు పిలుపునిచ్చిన మహారాష్ట్ర వికాస్ అఘాడీ