ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఆర్థిక భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద వ్యాపార సంస్థలకు లాభం చేకూర్చేందుకే ప్రైవేటు బ్యాంకులు చూస్తాయి తప్ప పేదల గురించి ఆలోచించవని లోక్సభలో అన్నారు.
" 9 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు.. ప్రైవేటీకరణకు నిరసనగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారితో చర్చలు జరపాలి. పేదలకు బ్యాంకు సేవలను అందించే లక్ష్యంతో బ్యాంకులను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతీయకరణ చేశారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నవి ప్రభుత్వ రంగ బ్యాంకులే. వాటిని ప్రైవేటీకరిస్తే బ్యాంకుల ఆర్థిక భద్రత విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ఇది పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. దేశ ప్రజలందరి సమస్య."