హాస్టల్లో ఉంటున్న మైనర్ విద్యార్థినులపై ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా జిల్లాలో జరిగింది. ఏడుగురు విద్యార్థినులు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పోలీసులు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
"మైనర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశాం. ఏడుగురు విద్యార్థులు అతనిపై ఫిర్యాదు చేశారు. వారంతా స్కూల్ హాస్టల్లో ఉంటున్నారు. నిందితుడుని జుడీషియల్ కస్టడీకి తరలించాం. తదుపరి విచారణ కొనసాగుతోంది."
- పోలీసులు
ఎస్సై మాటలతో మహిళ ఆత్మహత్యాయత్నం: క్యారెక్టర్‌లెస్ అంటూ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అవమానించాడని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌లో వెలుగు చూసింది. బాధితురాలిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసేందుకు మధోతండా పోలీస్ స్టేషన్‌కు బాధితురాలు శుక్రవారం వెళ్లింది. ఆమె ఫిర్యాదు తీసుకోకుండా.. క్యారెక్టర్‌లెస్ అంటూ అవమానించగా మనస్తాపానికి గురైంది. ఇంటికి వెళ్లి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేసు విచారణను పురానాపుర్ సీఐకి అప్పగించినట్లు చెప్పారు.
గిరిజన బాలికపై హత్యాచారం:మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ వ్యవసాయ క్షేత్రంలో చనిపోయి కనిపించిన 16 ఏళ్ల గిరిజన బాలిక కేసును ఛేదించారు పోలీసులు. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత మంగళవారం ఉదయం బాలిక తన బాదం, మామిడి తోటకు కాపలాగా వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 19,21 ఏళ్ల ఇద్దరు యువకులను శనివారం అరెస్ట్ చేశారు. తోటకు వెళతున్న బాలికను దారి మధ్యలో అడ్డగించి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పొలంలోని ఓ గుంతలో పడేసి రాళ్లు, గడ్డి వేసి కప్పేశారని చెప్పారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చూడండి:ఫైవ్ స్టార్ హోటల్లో మహిళపై బాలుడు అత్యాచారం.. టాయిలెట్లోకి చొరబడి..
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చేతిని కొరికి తప్పించుకున్న చిన్నారి