తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్... వారికి నష్టమే! - దిల్లీ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోం

Private offices WFH: కరోనా పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేస్తోంది దిల్లీ సర్కార్. ఈ క్రమంలోనే ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అందరూ వర్క్ ఫ్రం హోమ్​ పద్ధతిలో పనిచేయాలని సూచించింది. మినహాయింపులు ఉన్న సంస్థలు మాత్రం 100 శాతం సిబ్బందితో పనిచేయవచ్చని తెలిపింది.

Delhi Work From Home
Delhi Work From Home

By

Published : Jan 11, 2022, 3:34 PM IST

Delhi offices Work From Home: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ సర్కారు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లపై నిషేధం విధించగా.. ఇకపై ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. మినహాయింపు కేటగిరీలో ఉన్న కార్యాలయాలు మినహా మిగిలినవన్నీ వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో కార్యకలాపాలు సాగించాలని దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశించింది.

Delhi Covid restrictions

ప్రస్తుతం ప్రైవేటు కార్యాలయాలన్నీ 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఇవన్నీ వర్క్ ఫ్రం హోమ్ బాట పట్టనున్నాయి. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని డీడీఎంఏ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవి అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కాగా, రెస్టారెంట్లలో పార్శిల్ సేవలను మాత్రమే కొనసాగించేందుకు అనుమతించింది.

Delhi covid WFH news

బ్యాంకులు, ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్, ఫార్మా కంపెనీలు, న్యాయవాదుల కార్యాలయాలు, కొరియర్ సేవలు, ఎన్​బీఎఫ్​సీ, సెక్యూరిటీ సర్వీసులు, మీడియా, పెట్రోల్ పంప్​లు, ఆయిల్, గ్యాస్, రిటైల్ స్టోర్​లకు ఆంక్షల నుంచి మినహాయింపు లభించనుంది. ఈ సంస్థలు వంద శాతం సిబ్బందితో పనిచేయవచ్చు.

Delhi Covid surge

కరోనా పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం దాటినందున డిసెంబర్ 28న దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది డీడీఎంఏ. ఎల్లో అలర్ట్ ప్రకారం కార్యాలయాలన్నీ 50 శాతం మంది సిబ్బందితో పనిచేయాలి.

ప్రస్తుతం దిల్లీలో పాజిటివిటీ రేటు 24-25 శాతం మధ్య ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే, లాక్​డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్​సీఆర్) అంతటా ఆంక్షలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారని చెప్పారు.

ఆలోచించండి...

అయితే, తాజా ఆంక్షలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆల్ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మూడు లక్షల కార్యాలయాలు దిల్లీలో ఉన్నాయని, లక్షలాది మందికి ఇవి ఉద్యోగం కల్పిస్తున్నాయని తెలిపింది. ఆంక్షలు అనేక మందిని ప్రభావితం చేస్తాయని.. ఈ నేపథ్యంలో ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని అభ్యర్థించింది.

వ్యాపారులు సైతం ప్రభుత్వ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు కుదుటపడుతున్నాయని అనుకున్న సమయంలోనే మళ్లీ ఆంక్షలు విధించడం వల్ల.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

రెస్టారెంట్లు, బార్లపైనే ఆంక్షలు విధించడం న్యాయం కాదని జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మెట్రోలు, బస్సులు పూర్తి స్థాయిలో నడిపిస్తున్నారని, రోడ్డు పక్కన ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలనూ కొనసాగిస్తున్నారని అన్నారు. డీడీఎంఏ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరారు.

కూలీలు స్వస్థలాలకు...

సైకిల్ రిక్షాపై సామానుతో స్వస్థలానికి వలస కూలీ

ఆంక్షలు కట్టుదిట్టం చేస్తున్న నేపథ్యంలో రోజు కూలీల్లో కలవరం మొదలైంది. లాక్​డౌన్ విధిస్తారన్న అనుమానాలతో నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. కరోనా ఆంక్షల వల్ల ఇప్పటికే ఎలాంటి పని దొరకడం లేదని, అందుకే ఇంటికి పయనమయ్యానని అమరిందర్ కుమార్ యాదవ్ అనే డ్రైవర్ చెప్పాడు.

స్వస్థలానికి కూలీలు
.

ఆన్​లైన్ యోగా క్లాసులు...

మరోవైపు, హోమ్ ఐసోలేషన్​లో ఉన్న కరోనా రోగుల కోసం ఆన్​లైన్ యోగా క్లాసులు ప్రారంభించనుంది దిల్లీ సర్కార్. బుధవారం నుంచి క్లాసులు మొదలవుతాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. యోగా క్లాసులకు రిజిస్టర్ అయ్యేందుకు కరోనా రోగులకు ప్రత్యేక లింక్ పంపిస్తామని చెప్పారు. సుశిక్షితులైన నిపుణులు గంట పాటు యోగా క్లాసులు చెబుతారని వివరించారు. 40 వేల మంది రోగులకు యోగా క్లాసులు చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:కరోనా పరిస్థితిపై సీఎంలతో మోదీ భేటీ- కఠిన ఆంక్షలు విధిస్తారా?

ABOUT THE AUTHOR

...view details