కర్ణాటకలో దారుణం జరిగింది. పని మనిషిపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఆన్లైన్ ఏజెన్సీ ద్వారా పనిమనిషిని నియమించుకున్న ఆ వ్యక్తి.. బాధిత మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించకున్న మహిళ.. విషయాన్ని ఏజెన్సీ నిర్వహకులకు తెలియజేసింది. దీంతో ఆ వ్యక్తి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఏజెన్సీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పనిమనిషిపై యజమాని అత్యాచారం.. తల్లిని చూసుకునేందుకని పిలిచి..
పనిమనిషిపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోవాలంటూ.. ఓ ఆన్లైన్ ఏజెన్సీని ద్వారా పని మనిషిని నియమించుకున్న ఆ వ్యక్తి.. ఆమెపై అఘయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాధిత మహిళ ఏజెన్సీ నిర్వహకులు ఫోన్ చేసి చెప్పింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవమూర్తి(47) బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడ్లు ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోవాడానికి పనిమనిషి కావాలంటూ.. ఓ ఆన్లైన్ ఏజెన్సీని సంప్రదించాడు ఆ వ్యక్తి. దీంతో రూ.18వేల ఒప్పందంతో ఝార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని ఏజెన్సీ వారు కేశవమూర్తి ఇంటికి పంపించారు. యువతి ఇంటికొచ్చి చూడగా ఇంట్లో వృద్ధురాలు లేదు.
దీనిపై ఆమె కేశవమూర్తిని ప్రశ్నించగా.. ఆమె ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపాడు. కాగా, పనిలో చేరిన తొలిరోజు రాత్రి యువతి వంటగదిలో ఉండగా... కేశవమూర్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరకు, బాధిత యువతి తన కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించింది. ఆ తర్వాత నిందితుడు కేశవమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.