తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐపీఎల్ కోసం ఖైదీల నిరాహార దీక్ష - ipl strike in up prison

దేశంలో క్రికెట్ ఓ మతమైతే.. ఐపీఎల్ టోర్నీ ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ లాంటిది. మరి అలాంటి ఐపీఎల్​ను ఎవరు మిస్సవ్వాలని అనుకుంటారు చెప్పండి? జైలు ఖైదీలూ ఇందుకు మినహాయింపు కాదు కదా! యూపీలోని కారాగాలంలో శిక్ష అనుభవిస్తున్నవారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏకంగా నిరాహార దీక్షకు దిగారు.

up farrukhabad ipl strike
ఐపీఎల్ కోసం ఖైదీల నిరాహార దీక్ష

By

Published : Apr 13, 2021, 7:02 PM IST

ఐపీఎల్ ఫీవర్.. ఉత్తర్​ప్రదేశ్ ఫరూఖాబాద్​లోని ఓ కారాగారంలో నిరసనకు దారితీసింది. టీవీలో ఐపీఎల్ మ్యాచ్​లు చూసేలా ఏర్పాట్లు చేయాలని ఫతేగఢ్​ సెంట్రల్ జైలులోని ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు. అల్పాహారాన్ని మూకుమ్మడిగా మానేసి నిరసన వ్యక్తం చేశారు.

ఫతేగఢ్ సెంట్రల్ జైలు

ఈ సమయంలో లఖ్​నవూలో అధికారులతో సమావేశంలో ఉన్న జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ శుక్లా.. హుటాహుటిన కారాగారానికి తిరిగివచ్చారు. ఖైదీలతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. తమ డిమాండ్లకు జైలు అధికారులు ఒప్పుకోవడం వల్ల.. దీక్షను విరమించారు.

ఖైదీలు అనుభవిస్తున్న మానసిక క్షోభను తగ్గించేందుకు.. యూపీ ప్రభుత్వం జైళ్లలో వినోదానికి ఏర్పాట్లు చేయిస్తోంది. సంగీతం కోసం స్పీకర్ల ఏర్పాటు సహా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టీవీలను సైతం అందుబాటులో ఉంచుతోంది.

ఇదీ చదవండి:ఐపీఎల్​లో​ మరో 200 మ్యాచ్​లు ఆడతా: రోహిత్ శర్మ

ABOUT THE AUTHOR

...view details