తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జడ్జి ముందే గొంతు కోసుకున్న ఖైదీ - madras high court judge

మద్రాస్​ హైకోర్టులో ఓ ఖైదీ హల్​చల్​ చేశాడు. న్యాయమూర్తి ముందే బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు. జైలు అధికారులు వేధిస్తున్నందునే ఇలా చేశానని చెప్పాడు.

Prisoner slits throat
జడ్జి ముందు బ్లేడ్​తో గొంతు కోసుకున్న ఖైదీ

By

Published : Apr 9, 2021, 10:53 AM IST

Updated : Apr 9, 2021, 11:37 AM IST

తనను జైలు అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. మద్రాస్​ హైకోర్టులో ఓ ఖైదీ హంగామా సృష్టించాడు. న్యాయమూర్తి ముందే బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు.

ఏం జరిగిందంటే..

తమిళనాడులోని వ్యాసర్​పాడి ప్రాంతానికి చెందిన పాండియన్​.. ఓ మర్డర్​ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. మరో కేసు విచారణలో భాగంగా 4వ అదనపు సెషన్స్​ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి ముందు అతడు హాజరయ్యాడు.

న్యాయమూర్తి ముందు గొంతు కోసుకున్న ఖైదీ పాండియన్​

తనను జైలు అధికారులు వేధిస్తున్నారని న్యాయమూర్తికి చెప్పాడు పాండియన్​. ఈ విషయమై తాను లేఖ రాస్తానని, సదరు అధికారులపై తగిన చర్య తీసుకోవాలని కోరాడు. అకస్మాత్తుగా బ్లేడ్​ తీసి తన గొంతు కోసుకున్నాడు.

అనంతరం.. వెంటనే పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అన్ని రకాలుగా తనిఖీ చేసినప్పటికీ ​బ్లేడును పాండియన్ ఎలా తీసుకువచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైలులోనే అతనికి ఎవరైనా ఈ బ్లేడ్​ అందించారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:మంటల్లో కాలి బూడిదైన కొవిడ్​ రోగుల అంబులెన్స్​!

Last Updated : Apr 9, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details