విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన చందన్‌కుమార్ అనే ఓ ఖైదీ అతనితో పాటు జైలు నుంచి మాడిపోయిన రొట్టెలను తీసుకొచ్చి అక్కడి అధికారులు విస్తుపోయేలా చేశాడు. జైలులోని దుస్థితి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అతను అలా చేశాడు. ఖైదీలకు రోజూ ఇలాగే మాడిపోయిన రొట్టెలు లేదా అసలు కాలనివి ఆహారంగా పెడుతున్నారని.. ఇవి జంతువులు కూడా తినవని జైలులోని పరిస్థితి గురించి చెప్పుకుని వాపోయాడు. తనతో పాటు తక్షణమే జైలుకు వచ్చి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరై ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది.
'రోజూ ఇవి ఎలా తినగలం సారూ?'.. మాడిన రొట్టెలపై కోర్టులో ఖైదీ ఫిర్యాదు
జైలులో పెట్టే ఆహారం తినలేక ఇబ్బందులు పడుతున్న ఆ ఖైదీ అక్కడి అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడం వల్ల విసుగెత్తిపోయిన అతను.. ఉన్నతాధికారుల దృష్టికి ఎలాగైనా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కోర్టు విచారణ రోజు తను తినే ఆహారాన్ని కూడా పార్సిల్ తీసుకెళ్లాడు.
జైలు
జైలులో నుంచి ఏ వస్తువునూ బయటకు తెచ్చేందుకు సిబ్బంది అనుమతించరని.. అందుకే ఆ రొట్టెలను కాగితంలో చుట్టి ఎవరికీ తెలియకుండా కోర్టుకు తెచ్చినట్లు చందన్ కుమార్ వెల్లడించాడు. జైలులోని పరిస్థితులపై ఖైదీ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సతీష్ ఝా. సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతానని చందన్‌కు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :లారీతో ఢీకొట్టి మరో పోలీసు హత్య.. గంటల వ్యవధిలో ముగ్గురు బలి