క్రిమినల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ శానిటైజింగ్ చేస్తున్నట్లు నమ్మించి జైలు నుంచి తప్పించుకున్నాడు. ఏకంగా 30 అడుగుల ఎత్తైన గోడను దూకి పారిపోయాడు. కానీ, అతని కల నెరవేరలేదు. అతని సమాచారాన్ని పోలీసులకు తెలిసేలా చేసింది ఓ శునకం. దాంతో పోలీసులు సునాయాసంగా పట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటక చిక్కబళ్లాపుర్ జిల్లాలోని చింతామణి సబ్ జైలు వద్ద జరిగింది.
ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకరప్ప.. అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జిల్లాలోని బట్లహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతామణి సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులోని 30 అడుగుల గోడను దూకి పారిపోయాడు. గోడ దూకిన క్రమంలో అతని కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నడవలేని స్థితిలో ఉన్న అతను పోలీసులకు దొరకకుండా జైలుకు సమీపంలోని ప్రాంతంలో తలదాచుకున్నాడు. కానీ, శంకరప్పను గమనించిన ఓ శునకం అరవటం ప్రారంభించి.. పోలీసులకు అతని సమాచారం తెలిసేలా చేసింది.
ఖైదీని పట్టుకున్న పోలీసులు 30 అడుగుల ఎత్తైన జైలు గోడ అటుగా వెళ్లిన పోలీసులు ఆ శునకం అరుపులు విని తనిఖీలు చేపట్టారు. అక్కడే ఉన్న శంకరప్పను పట్టుకున్నారు. ఆ తర్వాత శంకరప్పను చింతామణి నగర పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:ఆపరేషన్ థియేటర్లోకి వరద నీరు- రోగుల ఇక్కట్లు