పిల్లలకు టీకా పంపిణీకి (Kids Vaccine Covid India) సంబంధించి నేషనల్ ఇమ్యూనైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్టీఏజీఐ) ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకే (Vaccination for Children in India) ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టీకా ప్రాధాన్యం ఆయా పిల్లల వ్యాధి తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
"దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతూ, కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న పిల్లలను గుర్తించి వారికి మొదట వ్యాక్సిన్ అందిస్తాము. ఆ తర్వాత మిగతా పిల్లలకు టీకా పంపిణీ చేపడతాము. మరో రెండు వారాల్లో పిల్లలకు టీకా పంపిణీపై స్పష్టత వస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీకాలు అందేలా ఏర్పాట్లు చేస్తాము."