మదర్సాలో 6వ తరగతి చదువుతున్న బాలిక అత్యాచారానికి గురైంది. పాఠశాల ప్రిన్సిపల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పలుమార్లు బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే...
గాజియాబాద్‌లోని మదర్సాలో బాధిత బాలిక 6వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా బాలిక ఇంట్లో దిగాలుగా ఉంటోంది. ఆరోగ్యం సైతం క్షీణిస్తూ వచ్చింది. ఇది గమనించిన బాలిక తల్లి విషయంపై ఆరా తీయగా ప్రిన్సిపల్ దారుణం వెలుగులోకి వచ్చింది. స్కూల్ అయిపోయిన తరువాత ప్రిన్సిపల్ శహదత్ మరిన్ని పాఠాలు చెప్పాల్సి ఉందని తనని ఆపేవాడని, అనంతరం అత్యాచారం చేసేవాడని బాలిక చెప్పింది. విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించేవాడని పేర్కొంది.
బాధిత బాలిక తోబుట్టువు సైతం ప్రిన్సిపల్‌పై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ చేతికిస్తూ గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని తెలిపింది. ఎవరికైనా చెబుతే తన సోదరుడిని కాలువలో తోసేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ప్రిన్సిపాల్ అఘాయిత్యం విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో తాను ధైర్యంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది బాలిక. దీంతో నిందితుడు శహదత్పై కేసు నమోదు చేశామని, అతన్ని అరెస్ట్ చెస్తామని పోలీసులు తెలిపారు.