ప్రధాని నరేంద్ర మోదీ.. దిల్లీలోని సిస్ గంజ్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కు మత గురువు, గురు తేగ్ బహదూర్ 400వ ప్రకాష్ పురబ్(జయంతి) సందర్భంగా ప్రార్థనలు చేశారు. ఆయనకు నివాళులర్పించి.. సేవలను స్మరించుకున్నారు.
బందోబస్తు లేకుండానే మోదీ 'గురుద్వారా' సందర్శన - దిల్లీ సిస్ గంజ్ సాహిబ్ గురుద్వారా
దిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్‌ను ఆకస్మికంగా పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మత బోధకుడు గురు తేగ్ బహదూర్‌కు నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండానే ఆయన వెళ్లడం విశేషం.
దిల్లీ గురుద్వారాకు ప్రధాని
షెడ్యూల్‌లో లేని పర్యటన కావడం వల్ల.. ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గురుద్వారాకు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని వెల్లడించాయి.
ఇవీ చదవండి:'ప్రజలకు అందుబాటులో ఉండండి.. అండగా నిలవండి'
Last Updated : May 1, 2021, 11:30 AM IST