తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెట్రోల్​, డీజిల్ ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు - చమురు ధరల గురించి మోదీ

ఇంధన దిగమతులపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఉంటే.. మధ్యతరగతి ప్రజలపై పెట్రో భారం పడేది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రానున్న రోజుల్లో ఇంధన దిగుమతులను తగ్గించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. పెట్రోల్​ ధరలు భారీగా పెరిగిన వేళ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Prime Minister Narendra Modi participated in launching event of oil and gas projects
గత పాలకుల వల్లే ఈ ఇంధన భారం: మోదీ

By

Published : Feb 17, 2021, 5:29 PM IST

Updated : Feb 17, 2021, 6:16 PM IST

రాజస్థాన్​లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.100 మార్కును దాటిన వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై దృష్టి సారించి ఉంటే.. మధ్య తరగతి ప్రజలపై భారం పడేది కాదని అన్నారు. తమిళనాడులో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. రామనాథపురం-తూత్తుకుడి సహజవాయువు పైప్​లైన్​ను జాతికి అంకితమిచ్చారు.

"నేను ఎవర్నీ విమర్శించాలని అనుకోవడం లేదు. కానీ, మనం ఈ(ఇంధన దిగుమతులు) అంశంపై అంతకుముందే దృష్టి సారించి ఉంటే.. మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడే వారు కాదు."

-ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ.

రానున్న రోజుల్లో ఇంధనాల దిగుమతి వాటాను తగ్గిస్తామని మోదీ అన్నారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 40 శాతం ఇంధనాలు భారత్​లో​ ఉత్పత్తి అవుతాయని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్​ 85 శాతం చమురు, 53 శాతం మేర సహజవాయువును దిగుమతి చేసుకుందని చెప్పారు.

మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్​లో ఇథనాల్​ మిక్సింగ్​ వాటాను పెంచామని మోదీ పేర్కొన్నారు. చెరకు నుంచి ఇథనాల్​ ఉత్పత్తి చేయడం వల్ల దిగమతులు తగ్గడమే కాకుండా.. రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని చెప్పారు.

Last Updated : Feb 17, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details