భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అంజలి ఘటించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించారు.
స్వర్ణ విజయ జ్యోతి వెలిగించిన ప్రధాని - రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధానికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ.. వీర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అంజలి ఘటించారు.
విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
యుద్ధ స్మారకం వద్ద శ్రద్ధాంజలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... స్వర్నిమ్ విజయ్ వర్ష్ లోగోను ఆవిష్కరించారు. త్రివిధ దళాల అధిపతులు యుద్ధస్మారకం వద్ద నివాళులు అర్పించారు. 1971లో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబరు 16న విజయ్ దివస్ పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులు విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్నారు.