'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్'ను (పీఎండీహెచ్ఎం) (Pm Digital Health Mission) ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News) సోమవారం ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రం పీఎండీహెచ్ఎంను దేశవ్యాప్తంగా అమలు చేయనుంది.
"ఈ రోజు చాలా ముఖ్యమైనది. గత ఏడేళ్లుగా దేశంలోని వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తున్న క్రమంలో మరో ముందడగు వేశాము. ఇదో కీలక దశ. దీని వల్ల దేశంలోని వైద్య సదుపాయాలకు సంబంధించి విప్లవాత్మక మార్పు జరుగుతుంది. మూడేళ్ల క్రితం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఈ పథకం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పీఎండీహెచ్ఎం(Pm Digital Health Mission) అమలవుతోందని పీఎంఓ ఇటీవల ప్రకటనలో పేర్కొంది. టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోంది. దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయిస్తారు.
పేదలకు , మధ్య తరగతి వారి కోసం..