తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా వేరియంట్లపై  ఓ కన్నేసి ఉంచాలి'

కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కొవిడ్​ పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సీఎంలతో జులై 16న భేటీ నిర్వహించనున్నారు.

modi
'కరోనా వేరియంట్లపై  ఓ కన్నేసి ఉంచాలి'

By

Published : Jul 13, 2021, 1:08 PM IST

Updated : Jul 13, 2021, 9:52 PM IST

కరోనా నిబంధనలు పాటించకుండా విహార ప్రాంతాల్లో, మార్కెట్లలో ప్రజలు గుంపులుగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొవిడ్​ నిబంధనలు పాటించే విషయంలో రాజీ పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్​ మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనా పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ సమీక్ష నిర్వహించారు మోదీ. ఈ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ పాల్గొన్నారు.

"కరోనా కారణంగా పర్యటక, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లాక్​డౌన్​లు సడలించగానే మార్కెట్లు, విహార ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా ఉండడం సరైన విధానం కాదు. మూడో దశ కరోనాను కట్టడి చేసేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి."

-ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా వేరియంట్లపై ఓ కన్నేసి ఉంచాలని మోదీ ఉద్ఘాటించారు. వైరస్​ మ్యుటేషన్​లపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఓ వైపు కరోనాను కట్టడి చేస్తూనే.. మరోవైపు చికిత్సను కొనసాగించాలని తెలిపారు. ఇటీవల ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఉపయోగించుకుని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించుకోవాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవాలని ఆయా రాష్ట్రాల సీఎంలను కోరారు. వైరస్​ వ్యాప్తి ఆరంభ దశలోనే క్షేత్ర స్థాయిలో కఠినమైన నిబంధనలు విధించాలని స్పష్టం చేశారు.

ఆ 6 రాష్ట్రాల సీఎంలతో 16న ..

కరోనా కేసులు ఇంకా తీవ్రస్థాయిలో నమోదవుతున్న కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సీఎంలతో జులై 16న భేటీ నిర్వహించనున్నారు ప్రధాని.

ఇదీ చదవండి:దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్

Last Updated : Jul 13, 2021, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details