తెలంగాణ

telangana

'టీకా పంపిణీ చూసి ఆ పార్టీకి జ్వరం పట్టుకుంది'

By

Published : Sep 18, 2021, 11:45 AM IST

Updated : Sep 18, 2021, 4:12 PM IST

వ్యాక్సిన్​ పంపిణీలో శుక్రవారం ఒక్కరోజే 2.5 కోట్ల టీకాలు పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు (pm on vaccination) ప్రధాని నరేంద్ర మోదీ. టీకా పంపిణీ జరగడం చూసి ఓ పార్టీకి జ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

pm modi latest news
మోదీ

రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ జరగుతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ (pm on vaccination) హర్షం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు (modi birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా 2.50 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ జరగడం పట్ల భావోద్వేగానికి గురయ్యానని.. ఇది మర్చిపోలేని సందర్భం అని చెప్పుకొచ్చారు. గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు, టీకా లబ్ధిదారులతో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

గోవా సీఎంతో వర్చువల్​ కాన్ఫరెన్స్​లో మోదీ
వర్చువల్​ కాన్ఫరెన్స్​లో మోదీ

'ఆ పార్టీకి జ్వరం పట్టుకుంది'

"మీ అందరి కృషి వల్ల దేశంలో ఒక్కరోజే 2.5 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయి. ఈ ఘనత అగ్రరాజ్యాలకు కూడా సాధ్యంకాదు. గంటకు 15 లక్షలు​, నిమిషానికి 26వేలు, సెకనుకు 425 వ్యాక్సినేషన్స్​ జరిగాయి. నాకు పుట్టినరోజు జరుపుకోవడం పట్ల ఆసక్తి లేకపోయినా.. ఈ సారి పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది. వ్యాక్సిన్​ వల్ల దుష్ప్రభావాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ నిన్న రికార్డు స్థాయిలో జరిగిన వ్యాక్సినేషన్ చూసి ఓ పార్టీకి జ్వరం పట్టుకుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాని

వ్యాక్సిన్లు వృథా కాకుండా ఉండేందుకు గోవా చేపడుతున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు మోదీ. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ కూడా పాల్గొన్నారు.

'రోజూ మోదీ బర్త్​డే ఉంటే బాగుంటుంది'

ప్రధాని రోజూ పుట్టినరోజు జరపుకుంటే బాగుంటుందని కాంగ్రెస్​ ఎద్దేవా చేసింది. మోదీ జన్మదినం సందర్భంగా 2.5 కోట్ల వ్యాక్సినేషన్ జరగడంపై ఈ విధంగా స్పందించింది. కేంద్రం ప్రతిరోజు ఇదే స్థాయిలో టీకా పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆ పార్టీ నేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి :Coronavirus update: ఒక్కరోజు 35 వేల కేసులు.. 33 వేల రికవరీలు

Last Updated : Sep 18, 2021, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details