తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు, తీర ప్రాంత భద్రతకు ఎన్​సీసీ: మోదీ - ఎన్​సీసీకి మోదీ కితాబు

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎన్​సీసీ కేడెట్లు దేశానికి ఎంతగానో సేవ చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశానికి సేవ చేయడంలో ఎన్​సీసీ ఎప్పడూ ముందుందని కితాబిచ్చారు. దిల్లీలో జరిగిన ఎన్​సీసీ పరేడ్​లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Prime Minister Narendra Modi
సరిహద్దు, తీర ప్రాంత భద్రతకు ఎన్​సీసీ: మోదీ

By

Published : Jan 28, 2021, 1:56 PM IST

దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన నేషనల్​ కేడెట్ కార్ప్స్ (ఎన్​సీసీ) పరేడ్​కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఎన్​సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. ఎన్​సీసీ చేస్తోన్న సేవలను కొనియాడారు.

పరేడ్​ను వీక్షిస్తోన్న ప్రధాని
కేడెట్ల గౌరవవందనం స్వీకరిస్తున్న ప్రధాని
జాతీయ జెండాలతో కేడెట్లు
ఎన్​సీసీ పరేడ్
ఎన్​సీసీ విద్యార్థుల కవాతు
ఎన్​సీసీ పరేడ్​ను వీక్షిస్తూ
ఎన్​సీసీ పరేడ్​లో మోదీ

"వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏం వచ్చినా ఎన్​సీసీ కేడెట్లు దేశానికి సేవ చేయడంలో ముందున్నారు. కరోనా సమయంలో లక్షలాది మంది కేడెట్లు అధికార యంత్రాంగానికి, సమాజానికి ఎంతో సహాయపడ్డారు.

సమాజంలో ఎన్​సీసీ పాత్రను ప్రభుత్వం ఇంకా విస్తరించాలనుకుంటోంది. సరిహద్దు, తీర ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ఎన్​సీసీని మరింత శక్తిమంతం చేస్తాం."

- నరేంద్ర మోదీ, ప్రధాని

దేశంలోని సరిహద్దు, తీర ప్రాంతాల్లోని 175 జిల్లాల్లో ఎన్​సీసీకి కొత్త బాధ్యతలు అప్పగిస్తామని గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించినట్లు మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం లక్ష మంది కేడెట్లకు సైన్యం, వాయుసేన, నేవీ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడింట ఒకవంతు మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details