తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో అతి పెద్ద జాతీయ ఎక్స్​ప్రెస్​ హైవే ప్రారంభం.. అభివృద్ధికి నిదర్శనమన్న మోదీ - delhi mumbai expressway status

మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడితే అవి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాయని ప్రధాని మోదీ అన్నారు. అందుకే గడిచిన తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయలపై భారీగా పెట్టుబడులు పెడుతోందని అన్నారు. రాజస్థాన్‌లో దేశంలోనే అతి పెద్ద జాతీయ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో.. తొలిదశలో నిర్మించిన రహదారిని ప్రధాని మోదీ ప్రారంభించారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదంతో సమర్థమైన, సమృద్ధి చెందిన భారత్‌ను నిర్మిస్తున్నామని మోదీ తెలిపారు.

modi inaugurates delhi mumbai expresswa
modi inaugurates delhi mumbai expresswa

By

Published : Feb 12, 2023, 4:51 PM IST

Updated : Feb 12, 2023, 5:31 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 1,386 కిలోమీటర్ల దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేలో.. తొలి దశలో నిర్మించిన 246 కిలోమీటర్ల సోహ్నా-దౌసా రహదారిని ప్రధాని ప్రారంభించారు. దీనివల్ల దిల్లీ నుంచి జైపుర్‌కు చేరుకునే సమయం అయిదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుందని మోదీ తెలిపారు. రహదారులు, పోర్డులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులపై భారీగా పెడుబడులు పెడుతోందని వెల్లడించారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెడితే.. అది వ్యాపారులకు, చిన్న దుకాణదారులకు, పరిశ్రమలకు బలం చేకూరుస్తుందని మోదీ అన్నారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి మరింత పెట్టుబడిని ఆకర్షిస్తుందని వెల్లడించారు.

"దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే తొలి దశ రహదారిని జాతికి అంకితం చేయడం.. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది దేశంలో అతి పెద్ద, ఆధునిక ఎక్స్‌ప్రెస్‌ వేల్లో ఇదీ ఒకటి. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది నిదర్శనం. గడిచిన తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మౌలిక సదుపాయాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించాం. 2014తో పోలిస్తే ఇది అయిదు రెట్లు ఎక్కువ. మౌలిక వసతులపై ఎంత భారీగా పెట్టుబడులు పెడుతామో.. అంతే భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే రాజస్థాన్‌కే గాక దేశాభివృద్ధికి కీలకంగా మారుతుంది. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ మా నినాదం. ఈ నినాదంతో ముందుకు వెళ్తున్న మేము.. సమర్థమైన, సమృద్ధి చెందిన భారత్‌ను నిర్మిస్తున్నాం."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

8 లేన్ల సోహ్నా-దౌసా 246 కిలోమీటర్ల రహదారిని 10,400 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. భారత్‌తోపాటు యావత్‌ ప్రపంచ నిర్మాణరంగం.. ముంబయి- దిల్లీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మొత్తం 1,386 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వేను.. కేంద్రం లక్ష కోట్లతో నిర్మిస్తోంది. 80 లక్షల టన్నుల సిమెంట్‌.. 12 లక్షల టన్నుల ఉక్కుతో ఈ రహదారికి అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ 8 లేన్ల రహదారిలో ఒక లేన్‌ను కేవలం.. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసమే కేటాయించారు. మధ్య మధ్యలో వైద్య కేంద్రాలు, హెలిప్యాడ్లు, మొత్తం 94 రకాల సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలోనే రికార్డుస్థాయి వేగంతో పూర్తవుతున్న హైవేగా పేరొందిన ఈ రహదారి.. సిద్ధమైతే దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మధ్య ప్రస్తుతమున్న దూరం 180 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ప్రయాణ సమయం మాత్రం ఇప్పుడున్న 24 గంటల నుంచి 12 గంటలకు అంటే సగానికి తగ్గిపోతుంది.

జాతీయ రహదారుల ఎగ్జిబిషన్​ను తిలకిస్తున్న మోదీ

2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దిల్లీతోపాటు మధ్యలో అయిదు రాష్ట్రాలను రాజస్థాన్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర దాటుతూ ఈ రహదారి వెళుతోంది. జైపుర్‌, అజ్‌మేర్‌, కోటా, ఉదయ్‌పుర్‌, చిత్తోర్‌గఢ్‌, భోపాల్‌, ఇందోర్‌, ఉజ్జయిని, అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదరా లాంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం అయిదు రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. ఈ ఏడాది చివరికల్లా ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

దేశంలో అతి పెద్ద జాతీయ ఎక్స్​ప్రెస్​ హైవే
Last Updated : Feb 12, 2023, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details