భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానికి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మోదీ.
జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్న మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న మోదీ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ.. మోదీ త్రివర్ణ పతాకం ఎగురవేసే సమయంలో ఆకాశం నుంచి పుష్ప వర్షం కురిసింది. భారత వాయుసేనకు చెందిన రెండు ఎంఐ 17 1వీ హెలికాప్టర్లు పూల రేకులను వెదజల్లాయి.
హెలికాప్టర్లు పూల రేకులను వెదజల్లుతున్న చిత్రం సుందరంగా ముస్తాబైన ఎర్రకోట ఎర్రకోటకు వచ్చే ముందు.. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు మోదీ. రాజ్‌ఘాట్‌ను సందర్శించి.. మహాత్ముడి సమాధికి అంజలి ఘటించారు.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.