యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని.. ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు ఇక లేవన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు మోదీ.
"యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబ రాజకీయాలు కొనసాగుతాయి. సామాన్య యువకులు సైతం పార్లమెంట్‌లో అడుగుపెట్టాలి. మనముందు వివేకానందుడు చూపిన మార్గం ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలి. యువతకు శారీరక, మానసిక దృఢత్వం అవసరమని వివేకానందుడు చెప్పారు. ఆయన అడుగుజాడలలోనే దేశం నడుస్తోంది.