తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 8:01 PM IST

Updated : Nov 5, 2020, 8:30 PM IST

ETV Bharat / bharat

'దీర్ఘకాల పెట్టుబడులకు భారత్​ ఉత్తమ స్థానం'

దీర్ఘకాలిక రాబడులు పొందేందుకు భారత్​ ఉత్తమమైన స్థానమని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే అత్యల్ప కార్పొరేట్​ పన్ను ఉన్న దేశం భారత్​ అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​ అనేది కేవలం ఒక విజన్​ మాత్రమే కాదని, ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యూహమని తెలిపారు.

Prime Minister Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దీర్ఘకాలిక రాబడిని పొందేందుకు భారత్​ ఉత్తమమైన స్థానంగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆత్మనిర్భర్​ భారత్​ అనేది కేవలం ఒక విజన్​ మాత్రమే కాదని, ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యూహమని పేర్కొన్నారు.

వర్చువల్​ గ్లోబల్​ ఇన్వెస్టర్​ రౌండ్​ టేబుల్​ సమావేశం-2020లో ప్రసంగించారు మోదీ. ప్రపంచంలోనే అత్యల్ప కార్పొరేట్​ పన్ను​ ఉన్న దేశం భారత్​ అని సూచించారు.

"మీరు విశ్వసనీయతతో రాబడులు, ప్రజాస్వామ్యంతో డిమాండ్​, స్థిరత్వం, సానుకూలతతో వృద్ధి కోరుకుంటే.. దానికి భారత్​ తగిన స్థానం. భారతదేశం ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్​లతో పాటు వైవిధ్యాలను అందిస్తోంది. ఒకే మార్కెట్లో బహుళ మార్కెట్లను పొందటమే మా వైవిధ్యం. అవి బహుళ పాకెట్​ సైజ్​లో, బహుళ ప్రాధాన్యతలు, బహుళ వాతావరణ పరిస్థితులు, బహుళ స్థాయి అభివృద్ధి నుంచి వస్తాయి. భారత్​ సాధించిన విజయాలు ప్రపంచ అభివృద్ధి, సంక్షేమంపై పలు రెట్లు ప్రభావాన్ని చూపుతాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వైరస్​తో పోరాడటం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించటంలో భారత్​ గొప్ప పనితీరును కనబరిచిందన్నారు మోదీ. అది మన వ్యవస్థల బలం, ప్రజల మద్దతు సహా మన విధానాలతోనే సాధ్యమైందని సూచించారు. భారత జాతీయ స్వభావాన్ని, నిజమైన బలాన్ని యావత్​ ప్రపంచ చూసిందని తెలిపారు. భారత్​ను ప్రపంచ ఉత్పాదక శక్తి కేంద్రంగా మార్చడానికి మా వ్యాపారాల సామర్థ్యాలను, కార్మికుల నైపుణ్యాలను ఉపయోగించటమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యూహం ఆత్మనిర్భర్​ భారత్​ అని వెల్లడించారు మోదీ.

ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులైన సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌ సహా అమెరికా, ఐరోపా, కెనడా, కొరియా, జపాన్‌, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థాగత పెట్టుబడిదారులు ఇందులో పాల్గొన్నారు. వీటి అధీనంలో సుమారు 6 ట్రిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయి. వీజీఐఆర్​- 2020లో ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చటం, ఆర్థిక విధానాలు, సంస్కరణలు, పెట్టుబడులకు అవకాశాలపై చర్చించారు.

ఇదీ చూడండి: ఫిబ్రవరిలోనే కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

Last Updated : Nov 5, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details