UP Polls Modi Campaign: ఉత్తర్‌ప్రదేశ్ అల్లర్ల రహిత రాష్ట్రంగా ఉండాలంటే భాజపా అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేరస్థులు జైళ్లకు వెళ్లాలన్నా.. మహిళలు ధైర్యంగా ఉండాలన్నా భాజపాను గెలిపించాలని కోరారు. సరహాన్పుర్లో ఎన్నికల ప్రచార సభకు ప్రత్యక్షంగా హాజరైన మోదీ.. విపక్షాలపై అస్త్రాలు ఎక్కుపెట్టారు.
మోదీ- సహరాన్‌పుర్ ఎన్నికల ప్రచార సభకు భారీగా తరలివచ్చిన జనం "పేద ప్రజలు మంచి ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా.. చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కిసాన్ యోజన నిధులు రావాలన్నా.. రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉండాలి. సీఎం యోగి.. నేరస్థులను జైళ్లకు పంపించారు. వారిని జైళ్లకు పంపకూడదా? రాజభవనాల్లో ఉంచాలా?"
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన భాజపా ఎన్నికల సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కాంగ్రెస్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం జనరల్ బిపిన్ రావత్ కటౌట్లను హస్తం పార్టీ ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. రాజకీయాల కోసం రావత్‌ను ఉపయోగించుకున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉత్తరాఖండ్ ప్రజలపై ఉందని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు.. సర్జికల్ స్ట్రైక్స్‌కు రుజువు కావాలని డిమాండ్ చేసిందని అన్నారు. జనరల్ రావత్‌ను సైతం అవమానించిందని ఆరోపించారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే అన్న మోదీ.. భాజపా చేపట్టిన 'విజన్ 2022' దాన్ని సాకారం చేస్తుందని చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి:మహిళ ఘాతుకం- ఐదుగురిని చంపి.. అంత్యక్రియల్లో పాల్గొని..
కరోనా వేళ 'ఓట్ల' పండగ- ఉత్సాహంగా తరలిన ఓటర్లు