గుజరాత్ అహ్మదాబాద్ మెట్రో రెండవ దశ పనులతో పాటు.. సూరత్ మెట్రో ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ వర్చువల్‌గా హాజరవుతారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది.
అహ్మదాబాద్ మెట్రో రెండవ దశలో భాగంగా 28.25 కి.మీ. పొడవైన కారిడార్‌ను రూ .5,384 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక నూతనంగా నిర్మించబోయే సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పొడవు 40.35 కిలోమీటర్లు. రెండు కారిడార్లున్న ఈ ప్రాజెక్టు వ్యయం రూ .12,020 కోట్లు.