తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండియా ఫస్ట్​'.. తల్లి మరణించిన బాధలోనూ కర్తవ్యాన్ని మరవని మోదీ

తల్లి మరణించిన బాధను దిగమింగుకుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. బాధలో ఉన్నా సరే.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా బంగాల్​లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​​ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

prime minister narendra modi
నరేంద్ర మోదీ

By

Published : Dec 30, 2022, 11:57 AM IST

Updated : Dec 30, 2022, 1:04 PM IST

తల్లి మరణించిన బాధలోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. బాధలో ఉన్నా సరే.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా బంగాల్​లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​​ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగాల్ మొదటి వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్​ హావ్​డా నుంచి న్యూ జల్​పాయిగుఢి మధ్య ప్రయాణిస్తుంది. ఈ రోజు మోదీ షెడ్యూల్​ ప్రకారం హావ్​డా వందేభారత్​ ప్రారంభోత్సవంతో పాటుగా.. జాతీయ గంగా కౌన్సిల్​ సమావేశం కూడా ఉందని పీఎంఓ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో బంగాల్​ మఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్​, గవర్నర్​ పాల్గొన్నారు.

బాధతో దిగాలుగా కూర్చొన్న నరేంద్ర మోదీ

మీ అమ్మ.. మా అమ్మే
వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం హీరాబెన్ మోదీ మృతికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. "అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీ అమ్మ నాకు అమ్మే.. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కూడా మీరు మీ విధులను నిర్వర్తించిన తీరు నిజంగా అభినందనీయం" అని మమతా అన్నారు. అయితే మఖ్యమంత్రి రాగానే అక్కడ ఉన్న ప్రజలు.. 'జై శ్రీరామ్'​ అంటూ నినాదాలు చేశారు. వద్దని కేంద్ర మంత్రి వారించినా సరే ప్రజలు ఆ మాటలు పట్టించుకోలేదు. దీంతో వేదికపై కూర్చోడానికి మమతా బెనర్జీ నిరాకరించారు. సాధారణ ప్రేక్షకులతో పాటుగా కూర్చోవాలని నిర్ణయించుకున్నారు.

బటన్​ నొక్కి ట్రైన్​ను ప్రారంభించిన మోదీ

"1943లో నేతాజీ సుభాశ్​చంద్ర బోస్​ అండమాన్​లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజునే ఇక్కడ వందేభారత్​ రైలు ప్రారంభమైంది. ర్వైల్వే వ్యవస్థ ఆధునీకరణ కోసం కేంద్రం భారీగా పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తున్నాం. బంగాల్​లో 25 కొత్త మురుగునీటి శుద్ధి ప్రాజెక్ట్​లు చేపట్టాం. వాటిలో 11 ఇప్పటికే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం వాటిలో 7 ఈరోజు ప్రారంభిస్తున్నాం. నదులు కలుషితం కాకుండా చూడాలని అన్ని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రపంచం మొత్తం భారతదేశంపై గొప్ప విశ్వాసంతో ఉంది. దీనికోసం ప్రతీ భారతీయుడు తనవంతు కృషి చేయాలి" అని మోదీ అన్నారు. వందేమాతరం నినాదంతో వందేభారత్​ను ప్రారంభించామన్నారు మోదీ. జోకా- తరటాలా ప్రాంతాలను చేరే మెట్రో ట్రైన్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం సుమారు 3:30 సమయంలో ఆమె కన్నుమూశారని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ బులెటిన్​లో వెల్లడించింది. ఆమె ఆరోగ్య విషమించడం వల్ల బుధవారమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మోదీ హుటాహుటిన దిల్లీ నుంచి గుజరాత్ వెళ్లి.. గంటకు పైగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రిలోని వైద్యులతో తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. అయితే గురువారం ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని మోదీ సోదరుడు సోమాభాయ్ తెలిపారు. గుజరాత్​ చేరుకున్న ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్​ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆమెకు నివాళులు తెలిపిన ఆయన అనంతరం తల్లి హీరాబెన్‌ పాడె మోశారు. గాంధీనగర్​లోని సెక్టార్ 30లో హీరాబెన్​ అంత్యక్రియలు పూర్తయ్యాయి.​

Last Updated : Dec 30, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details