డిజిటల్ ఎగ్జిబిషన్లో మోదీ
యోగా గురించి వివరిస్తూ మైసూర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషన్‌ను వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని వెంట సీఎం బసవరాజ్ బొమ్మె కూడా ఉన్నారు.
11:36 June 21
డిజిటల్ ఎగ్జిబిషన్లో మోదీ
యోగా గురించి వివరిస్తూ మైసూర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషన్‌ను వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని వెంట సీఎం బసవరాజ్ బొమ్మె కూడా ఉన్నారు.
07:28 June 21
దిల్లీ త్యాగరాజ స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో యోగాసనాలు వేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. రిషికేశ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు.
07:21 June 21
కులమతాలకు అతీతం యోగా: వెంకయ్య
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రత సాధించడం అని పేర్కొన్నారు. యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని.. కుల మతాలకు అతీతమైనదని వెల్లడించారు.
''యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిది. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది. కుల మతాలకు అతీతమైనది యోగా. ప్రపంచ దేశాల్లో శాంతికి దోహదం చేస్తుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. ఏ స్థాయిలో ఉన్నా యోగా సాధన తప్పనిసరి. కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది. పెద్దలు మనకు అందించిన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రపంచ శాంతిని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలి. యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చు.''
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
07:20 June 21
దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 'యోగా ఫర్ హ్యుమానిటీ' నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యోగాను గుర్తించిన ఐరాస సహా ప్రపంచదేశాలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందని అన్నారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని, జీవన విశ్వాసం ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
''యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదు.. అందరిది. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుంది. భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక. కరోనా విపత్తు సమయంలోనూ యోగా నిర్వహించాం. యోగా.. సమాజంలో శాంతి నెలకొల్పుతుంది. సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలి. ఐరాస, ఇతర దేశాలు యోగా సందేశం చేరవేస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు యోగా దోహదం చేస్తుంది.''
- నరేంద్ర మోదీ, ప్రధాని
06:28 June 21
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. కర్ణాటకలో 'మోదీ' ఆసనాలు
Modi Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(యోగా ఫర్ హ్యుమానిటీ) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.