PM Meets His Mother: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అఖండ విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్ పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు చేరుకున్న మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తల్లి హీరాబెన్‌కు ప్రధాని మోదీ పాదాభివందనం - MODI GUJARAT TOUR
PM Meets His Mother: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్‌ను కలిశారు.
మోదీ
ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు గాంధీనగర్ శివారులోని రైసిన్‌లో తన సోదరుడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ ఉన్న తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లితో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భాజపా విడుదల చేసింది.