అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముంబయి బాలిక టీరా కామత్ వైద్యానికి సాయం అందించేలా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్యు క్రమానికి సంబంధించిన ఈ అరుదైన వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధాల దిగుమతికి సుమారు రూ.6 కోట్ల మేర సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇంజెక్షన్ దిగుమతి, పాప చికిత్సకు మార్గం సుగమమైంది. ఐదు నెలల టీరా తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ విషయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా... కేంద్రం ఈమేరకు చర్యలు చేపట్టింది.
ఏంటా వ్యాధి?
'స్పైనల్ మసుక్యులర్ ఆట్రోపీ'(ఎస్ఎమ్ఏ) అనేది జన్యుక్రమానికి సంబంధించిన అరుదైన వ్యాధి. పిల్లల కండరాలను బలహీన పరిచి పాలు తాగేందుకు, ఊపిరి పీల్చుకునేందుకు సైతం ఇబ్బంది పడేలా చేస్తుంది. ఎదిగే క్రమంలో కనీసం సరిగ్గా కూర్చోలేరు కూడా.